TDP Meeting: తెలుగు దేశం పార్టీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో వచ్చిన ఉత్సాహాన్ని తెలంగాణలోనూ కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయీలు తీసుకోనున్నారు. ఇంతకీ టీడీపీ ప్లాన్ ఏంటంటే..?Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తెలుగ దేశం పార్టీ (Telugu Desam Party)లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) పార్టీలో నూతనోతేజాన్ని నింపాయి. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు అదే ఊపుతో తెలంగాణ (Telangana)లోనూ పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టిసారించింది. ఏం చేయాలి అన్నదానిపై ప్లాన్ యాక్షన్ రెడీ చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్ (Hyderabad) లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే లక్ష్యంగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది టీడీపీ.ఎ మ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది టీడీపీ . తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.
ముఖ్యంగా ఈ సమావేశం టీడీపీకి చాలా కీలకం కానుంది. ఎందుకంటే నాలుగేళ్ల తరువాత టీడీపీకి విజయాలు దక్కాయి. గెలుపు కోసం మొహం వాచిపోయిన సైకిల్ పార్టీకి.. తాజా విజయాలు బూస్టర్ డోస్ లా మారాయి. ఆ ఉత్సాన్ని రెండు రాష్ట్రాల్లో కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది పాలిట్ బ్యూరో సమావేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ – తీర్మానాలు వుంటాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!