
స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ..
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాపై ప్రేక్షకులు మంచి రివ్యూనిచ్చారు.
పాజిటివ్ రాక్ రావడంపై చిత్రం బృందం ఆనంద వ్యక్తం చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో యాంకర్ అనసూయ ఎమోషనల్ అయ్యారు. సినిమా గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్ రంగమార్తాండ సినిమా. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు.ఉగాది సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ విడుదలకాగా, అంతకుముందే ప్రముఖుల కోసం చిత్ర బృందం ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసింది. ప్రిమియర్స్ షోస్ చూసిన సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
సోమవారం వేసిన ప్రీమియర్ షో అనంతరం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా నటి, యాంకర్ అనసూయ భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణవంశీకి థ్యాంక్స్ చెబుతూ స్టేజ్ పైనే ఏడ్చేసింది. ” ఇక తాను మళ్లీ ఇలాంటి సినిమాలో నటిస్తానో లేదో తెలియదు. నా జీవితానికి రంగమార్తాండ మూవీ చాలు.నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ రంగమార్తాండ. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను.. అందుకే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది” అంటూ కృష్ణవంశీ వైపు తిరిగి ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం అనసూయ ఏడ్చిన అనసూయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.