సోనియాకు అస్వస్థత..
ఢల్లీిలోని గంగారామ్ ఆస్పత్రికి తరలింపు
ఈ ఏడాది ఆమె హాస్పిటల్లో చేరడం ఇది రెండవసారి
శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోనియా
న్యూఢల్లీి,మార్చి 3 : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢల్లీిలోని గంగా రామ్ హాస్పిటల్లో చేర్పించారు. బ్రాంకైటీస్ వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడ్డారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.