విశాఖపట్నం, మార్చి (ఆంధ్రపత్రిక):
ప్రతి ఒక్కరూ దంత సంరక్షణపై దృష్టి సారించాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు అన్నారు.
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాలు మేరకు నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా విశాఖ జిల్లాలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ,
ఉదయం నుంచి రాత్రి వరకు మనం ప్రతీపూట ఏదో ఒకటి తినడం, తాగటం చేస్తూ ఉంటామని, దీంతో నోరు మురికిగా మారుతుంటుందని, తద్వారా నోటిలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుందని . కాబట్టి నోటి పరిశుభ్రత చాలా ముఖ్యమన్నారు. రోజువారీ బ్రషింగ్ , ఫ్లాసింగ్ వంటివి బ్యాక్టీరియాను అదుపులో ఉంచుతాయన్నారు. అయితే, రోజుకు కనీసం రెండు సార్లు దంతాలను బ్రష్ చేసుకోవడం ఉత్తమం అన్నారు. అంతేకాకుండా ఏదైనా తిన్నవెంటనే నోటిని పుక్కిలించాలని, సరైన నోటి పరిశుభ్రత లేకపోతే దంతాలు పసుపు రంగులోకి మారతాయని, నోటి నుంచి దుర్వాసన వస్తుందని, దంత క్షయం, చిగుళ్ల వ్యాధి సహా ఇతర నోటి ఇన్ఫెక్షన్లకు ఇది దారితీస్తుందన్నారు.
నోరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నోటి ఆరోగ్యానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతీ ఏడాది మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తారు. నోటి పరిశుభ్రత, దంతాల పరిశుభ్రత, నోటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు మొదలైన వాటివి అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం అన్నారు.
డాక్టర్ సమత మాట్లాడారు.ప్రజలు, విద్యార్థులు అందరూ ఏదైనా తిన్నప్పుడు దంతాలు రంగు మారతాయని , అయితే కొన్ని పండ్లను తినడం ద్వారా దంతాలు వాటంతటవే శుభ్రపడతాయని తెలిపారు . నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని . ఆపిల్, అనాస పండు, జామ, క్యారెట్, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తెసుకోవాలి అని సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఎన్ సి డి స్టాఫ్ పాల్గొన్నారు .