న్యూఢల్లీి,మార్చి17(andhrapatrika): ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీదారుగా ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనేలా ఆయన ఎంతో కృషి చేశారని, దీన్ని గుర్తిస్తూ ఆయనకు నోబెల్ బహుమతిని అందజేసే అవకాశాలు లేకపోలేదంటూ స్వయానా ఆ కమిటీ డిప్యూటీ లీడర్ ఆష్లే టోజే ప్రకటించారనేది ఆ వార్తల సారాంశం. మోదీ- శాంతి బహుమతిని అందుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధాన్ని నిలువరించడానికి మోదీ కృషి చేశారని, దీనికోసం ఆయన ఆ రెండు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్‌స్కీతో పలుమార్లు ఫోన్ లో సంభాషించారంటూ వార్తలొచ్చాయి. ఈ కృషిని నోబెల్ కమిటీ గుర్తించిందని, ఇక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి అందుతుందంటూ అటు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపించాయి.
వాటన్నింటిపైనా నోబెల్ కమిటీ స్పందించింది. ఆ వార్తలన్నీ నకిలీవని కొట్టిపారేసింది. దీనిపై ఆష్లే టోజే స్వయంగా దీనిపై మాట్లాడారు. తాను చెప్పిందొకటి.. బయట ప్రచారంలోకి వచ్చిందొకటని తేల్చి చెప్పారు. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ పోటీదారుగా ఉన్నారంటూ వచ్చిన వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఢల్లీిలో ఓ కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన ఓ ట్వీట్- తప్పుడు సందేశాన్ని పంపించిందని వ్యాఖ్యానించారు.
తాను నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ హోదాలో భారత్ లో పర్యటించట్లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్‌స్టాండిరగ్ కమిటీ డైరెక్టర్ గా మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. భారత్ కు ఓ అత్యంత సన్నిహితుడిగా ఉంటోన్నానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప- ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టి పోటీదారుగా ఉన్నారని తాను చెప్పానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పారు.యుద్ధాలు చేయడానికి ఇది తగిన సమయం కాదంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ఆయన ఉటంకించారు. ఆ ప్రకటనను తాను స్వాగతిస్తోన్నానని వ్యాఖ్యానించారు. యుద్ధాల ద్వారా కాకుండా చర్చలు, శాంతియుత వాతావరణం మధ్య వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాలను భారత్ పంపించిందని గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషాదకర ఘటనగా అభివర్ణించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!