న్యూఢల్లీి,మార్చి17(andhrapatrika): ఢల్లీి పోలీసులు మరో సంచలనానికి తెర తీశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, వాయనాడ్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీకి తాజాగా నోటీసులు పంపించారు. పలు కీలక అంశాలను అందులో పొందుపరిచారు. వాటికి సమాధానాలను ఇవ్వాలని, సమగ్ర వివరాలను అందజేయాలనీ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాను వ్యక్తం చేస్తోంది. మరోసారి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను తమకు అందజేయాలంటూ ఢల్లీి పోలీసులు- రాహుల్ గాంధీకి పంపించిన ఈ నోటీసుల్లో పొందుపర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, బాధితులు తనను కలుసుకుని- భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారంటూ ఇదివరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. అత్యాచారానికి గురైన ఓ యువతితో తాను మాట్లాడానని, ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదంటూ తాను ప్రశ్నించగా- అందుకు ఆమె నిరాకరించారని చెప్పారు. పోలీసులను పిలవొద్దని విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడా యువతి, మరి కొందరి వివరాలను తెలియజేయాలంటూ రాహుల్ గాంధీకి ఢల్లీి పోలీసులు నోటీసులు పంపించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!