Rangamarthanda Review: రంగమార్తాండ అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కృష్ణవంశీ. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసి అనసూయ రియాక్ట్ అయింది.ఒకానొక సమయంలో టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్స్‌కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కృష్ణవంశీ (Krishna Vamsi).. తిరిగి ఇప్పుడు రీఫ్రెష్ అవుతూ రంగమార్తాండ (Rangamarthanda) అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం (Brahmanandam) కీలక పాత్రల్లో నటించారు. శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 22న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది.తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. భావోద్వేగంతో రివ్యూ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఒక మంచి సినిమా ఇది అని చెప్పారు చిరంజీవి. ఈ సినిమా త్రివేణి సంగమంలా అనిపించింది. ప్రతి ఆర్టిస్ట్ కి తన జీవితాన్నే కళ్ళముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది అని పేర్కొన్నారు.కృష్ణ వంశీ లాంటి ఓ క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందం ల కలయిక, ఈ ఇద్దరి నటన భావోద్వేగానికి గురి చేసింది అని చిరంజీవి పేర్కొన్నారు.బ్రహ్మానందం ఇంతటి ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రను పాత్ర చేయడం తొలిసారి. సెకండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్ కి, రమ్యకృష్ణకి, చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు అని చిరంజీవి అన్నారు.చిరంజీవి ఇచ్చిన ఈ రివ్యూ చూసి యాంకర్ అనసూయ రియాక్ట్ అయింది. థాంక్యూ సో మచ్ చిరు సార్ అని తెలిపింది. గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతపురం, ఖడ్గం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన కృష్ణ వంశీ.. మరోసారి రంగమార్తాండ రూపంలో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.రంగమార్తాండ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి.. బ్రహ్మానందంను సన్మానించారు చిరంజీవి, రామ్ చరణ్. ముఖ్యంగా బ్రహ్మానందం రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అయిందని అంటున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!