భీమవరం ఫిబ్రవరి 15 ( ఆంధ్ర పత్రిక ) : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మావారికి హుండీల ద్వారా 79 లక్షల 22 వేల 173 రూపాయల ఆదాయం లభించింది. ఇటీవలే అమ్మవారి వార్షిక ఉత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హుండీల లెక్కింపు చేపట్టారు. మొత్తం 34 రోజులకు గాను అమ్మవారికి రూ.79,22,173 ఆదాయం లభించింది. అలాగే బంగారం 134 గ్రాములు, వెండి 348 గ్రాముల 060 మిల్లీ గ్రాములు లభించింది. కొంత విదేశీ కరెన్సీ కూడా లభించిందని ఆలయ సహాయ కమినషర్, , కార్యనిర్వహణాషధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు (నాగన్నబాబు), ధర్మకర్తలు ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు, రామాయణం సత్యనారాయణ, గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకటలక్ష్మి, నీలాపు విజయ నాగలక్ష్మి, ఎక్స్ అఫీషియో సభ్యులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వి వెంకటేశ్వరరావు, ఈవో తోటి శ్రీనివాసరావు, కర్రి శ్రీనివాసరావు, బ్యాంకు సిబ్బంది, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!