భీమవరం ఏప్రిల్ 2 (ఆంధ్ర పత్రిక )
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి దుప్పల వెంకట రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈ ఓ,సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ,ఆలయ ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ,ముత్యాల వెంకట రామారావు , గోపిశెట్టి విజయలక్ష్మి , తాళ్లపూడి భాగ్యలక్ష్మి లు న్యాయమూర్తికి అమ్మవారి చిత్రపటాలు అందజేసి శా లువాతో సన్మానించారు . ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కుప్పేశ్వరరావు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.