స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదు
బ్రిటిష్ వారి కోసం పని చేశారు
రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడిపోతుంది
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే తీవ్ర విమర్శలు
అదానీపై విచారణకు పట్ట్టుబట్టిన విపక్షాలు
న్యూఢల్లీి,మార్చి17: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తోందని, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ప్రజాస్వామ్యం గురించి చర్చించే రాహుల్ గాంధీ వంటి వారు దేశవ్యతిరేకులా..? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు, రాహుల్ గాంధీ యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదిన మరోసారి స్పష్టం చేశారు ఖర్గే. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడిపోతుందని, అందుకే పార్లమెంట్ లో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీనే చాలా సార్లు విదేశాల్లో దేశాన్ని అవమానించారని అన్నారు.ప్రదాని నరేంద్రమోదీ ఆరేడు దేశాల్లో పర్యటించే సందర్భంలో మాట్లాడుతూ.. వ్యాపారులు, ప్రజలు భారత్ లో పుట్టి ఏం పాపం చేశారు అని అంటున్నారని అన్నారని, ముందుగా మోదీనే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల యూకే పర్యటనలో భాగంగా లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, మీడియా దాడులకు గురవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుండగా, హిండన్ వ్యవహారంలో అదానీపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాలు పట్టుబడుతున్నాయి.