కె.కోటపాడు,మార్చి30(ఆంధ్రపత్రిక):
ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టు ఆధ్వర్యంలో సీడీపీఓ మంగ తాయారు ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్న “పోషన్ పక్వాడ” అవగాహనా కార్యక్రమంను బుధవారం స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహించారు. ఈ అవగాహనా కార్యక్రమాల్లో చౌడువాడ ప్రాధమిక ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహారం తీసుకోవలసిన ఆవశ్యకతపై గర్భిణులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో ఎ.ఎన్.ఎం.నళిని, అంగన్వాడీ కార్యకర్తలు డోకల కుమారి, రమ, మంగళగిరి లక్ష్మీ,గాలి గౌతమి, లలిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.