కె.కోటపాడు,మార్చి11(ఆంధ్రపత్రిక):
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)ఎ.జి.చిన్నికృష్ణ పరిశీలించారు.స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 171,172 నెంబర్ల పోలింగ్ బూత్ లను శనివారం ఆయన సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని తహశీల్దార్ రమేష్ బాబుకు ఆర్డీవో చిన్నికృష్ణ సూచనలు ఇచ్చారు. తహశీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం నెంబర్ 171లో851మంది, 172లో825మంది వోటర్లు వోటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వారితోపాటు సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్ లీలాశేషుకుమారి, అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఉపతహసీల్దార్ సిహెచ్.అప్పారావు, ఎలక్షన్స్ సీనియర్ అసిస్టెంట్ జె.త్రిమూర్తులు తదితరులు ఉన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!