amaravathi, Andhrapatrika :*తమ చేనేత ఆడపడుచుకు ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించినందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు*
*- టీడీపీ గెలుపులో చేనేత వర్గాలు తమవంతుపాత్ర పోషిస్తారని చంద్రబాబుకు హామీ ఇచ్చిన చేనేత నాయకులు*
*- వందలాది మందితో ర్యాలీగా తరలి వెళ్లి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన మంగళగిరి చేనేత నాయకులు*
★ టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపుపై రాష్ట్రస్థాయిలో చేనేతవర్గం నుంచి పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
★ చేనేతలు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని ఆ వర్గాల్లో పట్టరాని సంతోషం వ్యక్తమవుతోంది.
★ గురువారం నాడు జరిగిన ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేనేతల ఆడపడుచు శ్రీమతి పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలిపి, అఖండ విజయంతో గెలిపించిన తెలుగుదేశం పార్టీ అధినేత, శ్రీ నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో చేనేత పద్మశాలి సంఘాలనేతలు శుక్రవారం కలిశారు.
★ టీడీపీ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీమతి పంచుమర్తి అనురాధ కూడా వారితో ఉన్నారు.
★ చేనేత సంఘాల నేతలు, పంచుమర్తి అనురాధ చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.
★ ఈ సందర్భంగా వారు టీడీపీ అధినేతను ఘనంగా సత్కరించి, వారి అభిమానం చాటుకున్నారు.
★ పంచుమర్తి అనురాధకు మంగళగిరి నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉండటంతో, ఆమెవిజయాన్ని ఆ నియోజకవర్గ చేనేత సంఘాలు తమవిజయంగా భావిస్తున్నాయి.
★ దీనితో శుక్రవారం నాడు చేనేత సంఘాల నేతలు భారీ ర్యాలీతో వందల మంది మంగళగిరి నుంచి చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
★ తెలుగుదేశంపార్టీ చేనేతల పక్షపాత పార్టీ అని, అఖండ చేనేత జనావళికి అద్భుతకానుకగా అనురాధగారికి చంద్రబాబుగారు గొప్పవిజయాన్ని అందించారని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు అన్నారు.
★ ఈ సందర్భంగా బాబు గారిని కలిసినప్పుడు అనురాధను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించినందుకు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
★ రాబోయేఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ను అఖండ మెజార్టీతో గెలిపించి బాబుగారికి బహుమతిగా అందజేస్తా మని చేనేత సంఘం నేతలు తెలిపారు.
★ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల చేనేత జనాభా ఉండగా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి విధేయులై ఉన్నారని గుత్తికొండ ధనుంజయరావు పేర్కొన్నారు.
★ ఈ కార్యక్రమంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, పద్మశాలి సంఘంనేత పంచమర్తి ప్రసాదరావు, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి కారంపూడి అంకమ్మరావు, రాష్ట్ర పద్మశాలి సాధికార కమిటీ అధ్యక్షులు మామిడి దేవేంద్రనాథ్, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు,రాష్ట్ర బీసీ సాధికార సమితి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, పంచమర్తి శ్రీధర్, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పడవల మహేష్, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి వింజమూరి ఆశాబాల, పద్మశాలి సంఘం నేతలు వంగర లక్ష్మయ్య, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు, పద్మశాలి సాధికార కమిటీ మీడియా కన్వీనర్ తిరువీధుల బాపనయ్య, గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున,అవ్వారు కృష్ణ, పొట్లాబత్తుని లక్ష్మణరావు, వింజమూరి చంద్రశేఖర్,దివి విజయలక్ష్మి, ఉద్దంటి పద్మావతి, ఊట్ల దుర్గా మల్లేశ్వరి, శలా సత్యనారాయణ, గుంటూరు జిల్లా పద్మశాలి సాధికార కమిటీ కన్వీనర్ బట్టు చిదానంద శాస్త్రి, బిట్ర దుర్గారావు, తమ్మిశెట్టి హరికృష్ణ,బట్టు మోహన్, అవ్వారు వంశీ,కొల్లి సత్యనారాయణ, దివి పిచ్చియ్య, గంట దుర్గా ప్రసాద్ తదితరులు చంద్రబాబు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.