900 కోట్ల ఆఫర్ అంటూ ప్రచారం
అల్లు అర్జున్ ఇప్పుడు వార్తల్లో వున్న నటుడు. ఎందుకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుడుగా వార్తల్లో వున్నాడు. కొందరు ఇది అతని పీఆర్ టీం చేస్తున్న హంగామా అని, మరికొంతమంది ఇది నిజమే అని పలు రకాలుగా పామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి ’పుష్ప’ సినిమాతో విపరీతమయిన క్రేజ్ వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ’పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. తెలుగు కథని ప్రపంచ వ్యాప్తంగా చూపించే ఘనత సుకుమార్ వలెనే సాధ్యపడిరది. ’పుష్ప 2’ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కావచ్చు అని అంటున్నారు. ఈ సినిమాకి ఎంత క్రేజ్ వుంది అంటే, ఈ సినిమాకి జీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ వింటే షాక్ అవుతారు. వాళ్ళు ఈ సినిమాకి అన్ని హక్కులు కలిపి రూపాయలు 900 కోట్లు ఇస్తామని చెప్పినట్లు వినికిడి. పరిశ్రమలో ఇప్పుడు ఇదే పెద్ద టాక్ గా నడుస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాతలు 1050 కోట్లు అడుగుతున్నారని, పరిశ్రమలో ఒకరు చెప్పారు. అసలు ఒక సినిమాకి ఇంకా షూటింగ్ అవుతుండగా ఇంత పెద్ద ఆఫర్ రావటం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే చరిత్ర సృష్టించినట్టే అని పరిశ్రమలో అంటున్నారు. అతనికి అంత క్రేజ్ లేకపోతే, అతని సినిమాకి ఇన్ని వందల కోట్లు ఆఫర్ ఎలా ఇస్తారు అని చర్చ కూడా పరిశ్రమలో నడుస్తోంది. ఈ ఆఫర్ లో అన్ని భాషల ఓ.టి.టి, శాటిలైట్ హక్కులు ఉన్నాయని అంటున్నారు. మరి థియేట్రికల్ హక్కులు ఇందులో ఉన్నాయో లేదో తేలేద్దు కానీ, అవి వున్నా కూడా ఇంత అమౌంట్ అంటే, అసలు ఈ ’పుష్ప 2’ అనే సినిమాకి ఎంత క్రేజ్ వుందో అర్థం అవుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో అత్యద్భుత నటన కనపరిచాడు. ఈ సినిమా చాలా దేశాల్లో ఆడిరది, అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన ’తగ్గేదే లే’ అన్న మేనరిజమ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!