సజావుగా ముందుకు సాగని బడ్జెట్ సమావేశాలు
సభలో బీజేపీ, విపక్షాల పోటాపోటీ నినాదాలు
సోమవారానికి వాయిదా పడ్డ పార్లమెంట్ ఉభయసభలు
న్యూఢల్లీి,మార్చి17: ఐదవ రోజు కూడా బడ్జెట్ సమావేశం వాయిదా పడిరది. గందరగోళం తగ్గే అవకాశం లేదు. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిక్షల ప్రతినిధులు తమ డిమాండ్ల కోసం పట్టుబడవుతాన్నాయి. తమ డిమాండ్లపై పార్లమెంట్ ఉభయ సభల్లో నిత్యం రచ్చ సృష్టిస్తున్నాయి. శుక్రవారం కూడా పార్లమెంట్ కార్యకలాపాల నిర్వహణపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనిచ్చేలా కనిపించడం లేదు..ఈ వ్యవహారం ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. ఉభయసభల్లో బీజేపీ, విపక్షాల పోటాపోటీ నినాదాలు చేశారు.. రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తే..అదానీ అంశాన్ని జేపీసీకి ఇవ్వాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.. సభలోనే ఆందోళనకు దిగారు సభ్యులు.. ఎంత చెప్పినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. సభ వెల్లోకి దూసుకెళ్లారు.దీంతో సభ్యుల ఆందోళనల మధ్యే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తుపై విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. అదానీ సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోనూ సభ్యులు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.