Tax Slab | పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరే తీపికబురు అందించింది. రూ. 7 లక్షలకు పైన స్వల్ప ఆదాయం కలిగిన వారికి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంచింది.
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అదిరిపోయే ప్రకటన చేసింది. ట్యాక్స్ పేయర్లకు అదనపు ప్రయోజనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు కొంత మేర ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చుకేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2023కు లోక్సభలో ఆమోదం తెలిపింది. 45 సవరణలతో ప్రభుత్వం ఈ ఫైనాన్స్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 కి పైగా సెక్షన్లను జత చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కీలక ప్రకటన చేశారు.పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించారు. ట్యాక్స్ రిలీఫ్ కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పన్ను ఆప్షన్ ఎంచుకునే వారికి ఆదాయం స్వల్పంగా రూ. 7 లక్షలు దాటినా కూడా పన్ను చెల్లించాల్సిన అవరసం లేదని పేర్కొంది.ఫైనాన్స్ బిల్లు 2023 ప్రకారం అయితే కొత్త ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకున్న వారికి రూ. 7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ. 7 లక్షలుకు పైగా ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట లేదు.
అయితే ఇప్పుడు వీరికి మార్జినల్ రిలీఫ్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే దీని వల్ల రూ. 7,00,001 నుంచి రూ. 7,29,000 వరకు ఆదాయం కలిగిన వారిని కూడా రూ. 7 లక్షల ఆదాయం కలిగిన వారితో సమంగా పరిగణిస్తారుదీని వల్ల వార్షిక ఆదాయం రూ. 7 లక్షలు దాటినా కూడా ఇబ్బంది లేదు. కాస్త ఎక్కువ ఆదాయం వచ్చినా కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. దీని వల్ల వారికి భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.ఉదాహరణకు రూ. 7 లక్షలకు లోపు ఆదాయం ఉంటే.. అప్పుడు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అదే రూ.7,00,100 ఆదాయం ఉంటే.. అప్పుడు రూ. 25,010 మేర ట్యాక్స్ పడుతుంది. అంటే రూ. 100 ఆదాయం పెరిగితే.. ట్యాక్స్ రూపంలో రూ. 25 వేలు చెల్లించుకోవాలి.ఇది వరకు ఇలాంటి విధానం ఉండేది. అయితే ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీని నుంచి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే ప్రకటన చేశారు. రూ. 100 దాటినా కూడా ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పని ఉండదు.అంటే పన్ను చెల్లింపుదారులకు రూ. 7 లక్షలకు పైన ఆదాయం స్వల్పంగా పెరిగినా కూడా ఇబ్బంది లేదు. ప్రత్యక్షంగానే రూ. 25 వేలు ఆదా అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ పేయర్లకు మోదీ సర్కార్ తీపికబురు అందించిందని చెప్పుకోవచ్చు. కాస్త ఆదాయం పరిమితిని దాటినా కూడా ఇబ్బంది ఉండదు.