Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, సీనియర్ నటి పవిత్రకు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా సహ జీవనం చేస్తోన్న వీళ్లిద్దరు తాజాగా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒకటయ్యారు. ఇదిలా ఉంటే.. పవిత్ర లోకేష్, నరేష్ అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు. వీరి మధ్య రిలేషన్ ఎప్పటి నుంచి కొనసాగుతుంది? వీరి ప్రేమ ఎక్కడ ఎలా చిగురించిందనే ఇలా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు నెటిజన్లు.నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం.. ఈ మధ్యకాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాలీవుడ్‌లో చాలామంది ఇప్పుడు వీరిద్దరి మధ్య రిలేషన్ గురించే జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక వీరి మధ్య సంబంధం గురించి కూడా మీడియాలో కూడా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా వీళ్లిద్దరు మూడు ముళ్ల బంధంతో ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురితో కూడా నరేష్ కలిసి ఉండటం లేదు. ఇద్దరికి విడాకులు ఇచ్చేశాడు. మూడో భార్య రమ్య విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది. ఈ క్రమంలో ఆయన నాలుగో పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే ఇపుడు నాల్గో పెళ్లి చేసుకున్నాడు. ఇక నాల్గో పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేసారు. అయితే నెటిజన్స్ మాత్రం ఇదంతా పబ్లిసిటీ జిమ్మిక్కు అంటూ కొంత మంది కొట్టి పారేస్తున్నారు. సీనియర్ నటి పవిత్రా లోకేష్‌ను నరేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు నరేష్ మూడవ భార్య రమ్య తెరపైకి రావడం… నరేష్ పవిత్రను ఒకే హోటల్ రూంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై నరేష్ పవిత్ర ఓపెన్‌గా మాట్లాడారు. నరేష్ మూడవ భార్య దూరంగా ఒంటరిగా ఉంటున్న సమయంలోనే ఆయనకు పవిత్ర దగ్గరైనట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించినా … 2018లో వచ్చిన ఓ సినిమా వీరి మధ్య బాండింగ్ బలపడటానికి కారణమని తెలుస్తోంది.నరేష్ పవిత్ర కలిసి 2018లో సమ్మోహనం సినిమా చేశారు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా ఈ సినిమా వచ్చింది. ఇందులో సుధీర్ తల్లిదండ్రులుగా నరేష్ పవిత్ర లోకేష్ నటించారు. అయితే ఈ సినిమాలో వీరిద్దరు నటించే అనేక సన్నివేశాలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక గతంలో నరేష్‌కు సంబంధించిన చాలా ప్రెస్ మీట్లలో, ఈవెంట్లలో పవిత్ర లోకేష్ కనిపించారు. ఆయన పక్కనే ఉన్నారు. నరేష్ బర్త్ డే వేడుకల్లో కూడా పవిత్ర లోకేష్ పార్టిస్ పేట్ చేశారు. నరేష్ మా ప్రెసిడెంట్ అయిన సందర్భంలో కూడా పవిత్ర లోకేష్ ఆయన వెంటే ఉన్నారు.
వీరిద్దరూ జంటగా నటించిన అనేక సినిమాలు ఉన్నాయి. ఇక వీరిద్దరు కూడా ఆన్ స్క్రీన్ పై మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. దీంతో పవిత్రకు కూడా ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అటు నరేష్ కూడా తన సినిమాల్లో దాదాపు పవిత్ర ఉండేలా చూసుకునేవారంట. ఆమెను ఎక్కువగా తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. అయితే గతేడాది వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నరేష్‌కు పవిత్ర చెల్లెలు వరుస పాత్రలో నటించడం పై ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్స్ చేసారు. మరోవైపు గత కొన్నేళ్లుగా పవిత్ర లోకేష్ కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. ఆమె తన భర్త సుచేంద్రప్రసాద్‌తో గొడవల నేపథ్యంలో ఆమె కూడా ఒంటరిగానే ఉంటుంది. అదే సమయంలో నరేష్ తనకు ఇచ్చిన సపోర్ట్‌తో ఆయనకు దగ్గరైందని టాలీవుడ్‌లో పలువురు అనుకుంటున్నారు. అయితే వీరిద్దరికి విడాకులు కాకపోవడంతో.. వీరి ఇప్పుడు నాలుగో పెళ్లి అధికారికంగా చేసుకునే అవకాశం మాత్రం లేకుండా పోయిందని అందరు అనుకున్నారు. తాజాగా అవేమి పట్టించుకోకుండా నరేష్ ఎంతో ధైర్యంతో నాల్గో పెళ్లి చేసుకున్నాడు గతకొన్నాళ్లుగా నరేష్ పవిత్ర లోకేష్ ఒక దగ్గరే ఉంటున్నారని తెలుస్తోంది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారా లేదా అనేది మాత్రం తెలియలేదు. కానీ నరేష్ ప్రతీ విషయంలో కూడా పవిత్ర ఉందని కొన్ని వీడియోలు చూస్తే తెలుస్తోంది. మా ఎన్నికల సమయంలో కూడా ఆమె నరేష్ వెంటే ఉంది. ఆయన పక్కనే ఉండి ఎన్నిలక ఏజెంట్‌గా పనిచేసిందని స్వయంగా నరేష్ మీడియాకు చెప్పి ధన్యవాదాలు చెబుతున్న వీడియోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. మరోవైపు పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా ఈ వ్యవహారంపై మాట్లాడారు. పవిత్రతో తనకు పెళ్లైందని.. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం తమ వద్ద లేదన్నారు. పవిత్ర లోకేష్ భర్తను నేను.. ఆమె పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు చూస్తే మీకే తెలుస్తుందన్నారు. ఏది ఏమైనా ఒక మాస్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో.. వీళ్ల ప్రేమ నుంచి పెళ్లి వరకు అన్ని ట్విస్టలున్నాయి. ఏది ఏమైనా వీరి ప్రేమకు పెళ్లితో శుభం కార్డు వేసారు. ఒక వేళ స్టంట్ కోసమే వీళ్లు పెళ్లి వీడియో చేసినట్టు ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.