డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’వాలి’, ’ప్రియురాలు పిలిచింది’, ’గ్యాంబ్లర్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. అతను నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈ ఏడాది ’వలిమై’తో మంచి విజయం సాధించిన అజిత్.. ప్రస్తుతం అదే జోష్‌తో ’తునివు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమౌవుతున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడిరచాడు. అజిత్ ఈ సినిమా కథను పూర్తిగా వినలేదట. కేవల ఒక్క సీన్ విని కథను ఒకే చేశాడట. అయితే ఇప్పుడు ఆ సీన్‌ను సినిమా నుండి తొలిగించామని తెలిపాడు. ఒక్క సీన్‌తోనే అజిత్ సినిమాను ఓకే చేశాడంటే.. హెచ్. వినోద్‌పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అని తెలుస్తుంది. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట. అందుకే సినిమా ప్రమోషన్లపై ఇంట్రెస్ట్ చూపించడలేదట. యాక్సన్ ఎంటర్టైనర్గా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన అజిత్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. త్వరలోనే చిత్రబృందం తెలుగు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. రాధాకృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాకు తెగింపు అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!