అమరావతి, మార్చి17(andhrapatrika): రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాళ భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడిరది. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగండ్లు పడ్డాయి. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. రాయలసీమలోని అన్నమయ్య రాయచోటి, ప్రకాశం జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. తమిళనాడు ఉత్తర ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడిరది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఇది విస్తరించింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలో చిక్మగళూరు, చామరాజనగర జిల్లాలు, మంగళూరులో ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడిరది. ఈ ద్రోణి మరింత విస్తరించింది. కర్ణాటక, తమిళనాడుకు ఆనుకుని ఉండే రాయలసీమ జిల్లాలపై ప్రభావాన్ని చూపింది. అన్నమయ్య రాయచోటి, కడప జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఉత్తరాంధ్రలోని పాడేరు, అరకు, పార్వతిపురం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అరకులో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణం కేంద్రం తెలిపింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు పడటంతో జహంగీర్ బాబా అనే వ్యక్తి మరణించాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో పిడుగు పడటంతో నరసింహులు అనే రైతు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా- ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని పేర్కొన్నారు. శనివారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం కూడా అదే పరిస్థితి ఉంటుందని వివరించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!