అడిగేదెవరు..? అనుమానాలెన్నో..?
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో రెండు ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపుచేశారు. రెండో శనివారం సెలవు దినం కావడంతో కలెక్టరేట్ కార్యాలయానికి ఉద్యోగులు ఎవరూ రాలేరు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి.. ఎంతవరకు నష్టం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఎన్నికల సామాగ్రి కూడా తగలబడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనూ కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫైళ్లు తగలబడ్డాయి.