జనసైనికుల డిమాండ్
అనకాపల్లి, నవంబర్ 3 (ఆంధ్రపత్రిక) : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు రక్షణకై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జనసైనికులు డిమాండ్ చేశారు.స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకత్వంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామదాసు గోవిందరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రక్షణ కల్పించడంలో ఘోరంగా ప్రభుత్వం విఫలం చెందిందని తక్షణమే ప్రభుత్వం జెడ్ కేటగిరీ కేటాయించాలి అని తెలిపారు. మొన్న వైజాగ్ కార్యక్రమంలో జరిగినటువంటి జరిగిన కార్యక్రమంలో అవకతవకలు జరిగాయి . హోటల్ నుంచి తిరిగి వెనక్కి పంపించడం జరిగింది అదేవిధంగా ఆయనకి రక్షణ కల్పించలేక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుండా ప్రశ్నించే గొంతును నొక్కేస్తుంది అని అన్నారు. అలాగే దూలం గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలని. ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క డిమాండ్లు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడి రామకృష్ణ, గళ్ళ కొండలరావు, మల్ల శ్రీను సత్యం దొర, భర్నికాన రాము, గంగుపాం జగదీష్.తదితరులు పాల్గోన్నారు.