వేపాడ,ఏప్రిల్,4(ఆంధ్ర పత్రిక):- మండలంలోని కరకవలస గ్రామంలోగల రాజ వీధి ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది.గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్లల్లో వాడుతున్న వాడుక నీరు రోడ్డు పైకి రావడం వల్ల రోడ్డు నీటితో నిండిపోయింది.ఆ రహదారి గుండా ప్రయాణం సాగించే వాహన శోధకులు, గ్రామస్తులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రయాణికులకు అది చెరువు కాదు రహదారే అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికైనా అధికారులు,పాలకులు,స్పందించి రోడ్డుపై నీరు నిల్వ లేకుండా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి అటు ప్రయాణికులకు ఇటు గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.లేనియెడల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని కొంతమంది గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత కనుమరుగవుతున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.