Ram Charan: Shelved Movies : యాక్టర్ అన్న తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో ఏదో అనుకోని అవాంతరల వల్ల ఆగిపోతుంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది.నటుడు అన్న తర్వాత కొన్ని పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత.. సెట్స్ పైకి వెళ్లే లోపు ఆయా సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో అనివార్య కారణాలతో ఇబ్బంది పడుతుంటారు.దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈయన కెరీర్లో కొన్ని సినిమాలు మొదలు పెట్టి ఆపేసారు. అందులో కొరటాల శివ సినిమా కూడా ఉంది. అప్పుడు మిస్ అయినా కూడా ఇప్పుడు ఆచార్య సినిమాలో తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అప్పట్లో వీరికి సరైన కథ కుదరక ఈ సినిమా ఆగిపోయినట్టు కొరటాల శివ తన ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారుదాంతో పాటు కెరీర్ మొదట్లోనే మరో సినిమాను కూడా మొదలు పెట్టి ఆపేసాడు చరణ్. అదే తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో ముహూర్తం జరుపుకున్న మెరుపు సినిమా. అప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం సినిమా తెరకెక్కించాడు ధరణి. అది ఫ్లాప్ అయింది. అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చి ఓకే అన్నారు.మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేసాడు రామ్ చరణ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ డిజాస్టర్ అయింది. నాగబాబును నిర్మాతగా పూర్తిగా ముంచేసింది ఆరెంజ్. దీని అప్పుల నుంచి కోలుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేసాడు నాగబాబు.అంతటి దారుణమైన ఫలితం అందించింది ఈ చిత్రం. అయితే ఆరెంజ్ తర్వాత ఈయన మెరుపు అనే సినిమా మొదలు పెట్టి ఆపేసాడు. ఈ సినిమాలో హీరోయిన్గా లక్కీ బ్యూటీ కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నారు. ఇది ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే కథ. అందుకే ఈ చిత్రంలో కోచ్ పాత్రలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను తీసుకున్నారుఅట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఆపేసారు. నిర్మాత బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసారు. మెరపు సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని.. అప్పట్లో చరణ్‌పై ఈ బడ్జెట్ వర్కవుట్ కాదని ఆపేసారని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత ఎప్పుడూ మెరుపు సినిమా గురించి ఆలోచించలేదు దర్శక నిర్మాతలు. అలా ఫుట్ బాల్ ప్లేయర్‌గా రామ్ చరణ్‌ను చూసే అవకాశం మిస్ అయిపోయింది. అయితే ఇప్పటికీ తనకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే యిష్టం అంటున్నాడు చరణ్. అలాంటి కథ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోయే సినిమాలో స్పోర్ట్స్ పర్సన్‌గానే కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కూడా అనూహ్యంగా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇపుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!