Delhi: మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగ తర్వాత తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఎంత శాతం అంటే.
మోదీ(Modi) సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగ తర్వాత తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Ggovernment Eemployees )కు 38శాతం డీఏ (DA)పొందుతున్నారు. పెంచిన 4శాతం కలుపుకొని 42శాతానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డీఏ 4శాతం పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా మరో 12వేల 815కోట్ల రూపాయల భారం పడనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ 4శాతం 2023 జనవరి నెల ఒకటవ తేదీ నుంచి వర్తిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో మొత్తం 47.58లక్షల మంది ఉద్యోగులకు, 69.76లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలుగుతుంది.