కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రెండింటి లక్షణాలు వేరు, నిర్లక్ష్యం చేయొద
Kidney VS Gallbladder Stones: కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రెండింటి లక్షణాలు వేరు, నిర్లక్ష్యం చేయొద
కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లక్షణాలను పొరబడే అవకాశాలు ఉన్నాయి. ఇవి రెండూ ఒక రకమైన ఇబ్బందికి కారణమవుతాయి. ఈ రెండింటిలో కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల సమస్య ఏమిటో తెలుసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది.
కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ రెండింటి వల్ల శరీరంలోని ధ్రవాల కదలిక ఆగిపోవచ్చు.
గాల్ బ్లాడర్ లో రాళ్లు కొలెస్ట్రాల్ తో తయారైతే, మూత్రపిండాళ్లో రాళ్లు కాల్షియం లవణాలు, ఇతర ఖనిజాలతో తయారవుతాయి. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క వివిధ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ స్టోన్స్:
కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. సిస్టీన్, అమైనో యాసిడ్, స్ట్రువైట్ వంటి వాటి వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. ఇవి బియ్యపు గింజల సైజు నుండి గోల్ఫ్ బాల్ సైజు వరకు ఉంటాయి.
ఇవి మూత్ర నాళంలోకి వెళ్లినప్పుడు చాలా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల ఉన్న వారిలో సాధారణంగా వెన్ను నొప్పి, పక్కల్లో నొప్పి, పొత్తి కడుపు, గజ్జల్లో నొప్పి వస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్లు లక్షణాలు:
* క్లౌడీ యూరిన్
* దుర్వాసనతో వచ్చే మూత్రం
* మూత్రంలో రక్తం
* వికారం, వాంతులు
* జ్వరం, చలి
* మూత్రం పోయడానికి ఇబ్బంది పడటం
గాల్ బ్లాడర్‌లో రాళ్లు:
పొత్తికడుపు యొక్క కుడి ఎగువ భాగంలో ఉండే చిన్న అవయవమే పిత్తాశయం. ఇది కాలేయం ద్వారా ఉత్పత్తి అయిన పిత్తాన్ని నిల్వ చేస్తుంది. పిత్తాశయంలో కొలెస్ట్రాల్, బిలిరుబిన్ వంటి పదార్థాలు చిన్న చిన్న స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఈ కణాలు ఒకటొకటి కలిసి రాళ్లుగా ఏర్పడతాయి. పిత్తాశయ రాళ్లు ఎందుకు ఏర్పడతాయన్న కచ్చితమైన కారణం తెలియదు.
పిత్తాశయంలో రాళ్లు లక్షణాలు:
* వికారం, వాంతులు
* అజీర్ణం
* వెనక లేదా కుడి భుజం బ్లేడులో నొప్పి
* ఉబ్బరం, గ్యాస్
* కామెర్లు
* క్లే కలర్డ్ స్టూల్స్
కిడ్నీ స్టోన్స్ చికిత్స:
* పుష్కలంగా నీరు తాగాలి. అలా తాగడం వల్ల చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
* అసౌకర్యంగా అనిపిస్తే వైద్యులు మందులు సిఫార్సు చేస్తారు.
* మూత్రపిండాళ్లో ఏర్పడ్డ రాళ్లను తొలగించడానికి ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ(ESWL) సూచిస్తారు.
* రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు.
గాల్‌బ్లాడర్ చికిత్స:
* అసౌకర్యంగా అనిపిస్తే నొప్పి మందులు రాసిస్తారు వైద్యులు
* పిత్తాశయంలో ఏర్పడ్డ రాళ్లను కరిగించేందుకు మందులు