Puli Meka: ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది 8 ఎపిసోడ్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పులి మేక’. అప్పటినుంచి ఈ పులి మేకకు భారీ ఆదరణ దక్కుతోంది.ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది 8 ఎపిసోడ్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పులి మేక’ (Puli Meka). దీన్ని జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కాంబినేషన్లో ఈ ఒరిజినల్ రూపొందింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సిరీస్‌లో అసలు మెగా ట్విస్ట్ ఏంటంటే సిటీలో పోలీసులను వరుసగా హత్యలు చేసే కిల్లర్ ఎవరో కాదు.. ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిరణ్ ప్రభ. ఈ విషయం తెలిసిన తర్వాత ఆడియెన్స్‌లో తెలియని ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు కారణం ఆ పాత్రలో నటించిన లావణ్య త్రిపాఠినే ఆ సిరీస్ ప్రధాన పాత్రధారి కావటం. సమాజంలో అమ్మాయిలకు జరుగుతున్న సమస్యలపై ఆమె పోరాటం చేస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లో కిల్లర్ ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ప్రేక్షకులు కూడా అలా చూడటానికే ఇష్టపడతారు. అయితే అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను రివీల్ చేయటానికి యాక్టర్ నితిన్ సపోర్ట్ తీసుకున్నారు మేకర్స్. అందుకు కారణం రైటర్, షో రన్నర్ కోన వెంకట్‌కు మాత్రమే అసలు కిల్లర్ ఎవరు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌లో ఇంకా ఊహించని ట్విస్టులున్నాయని తెలుసు.
‘‘ఇప్పుడే సిరీస్ చూశాను. ఇంత పెద్ద ట్విస్ట్‌ను రివీల్ చేయటం ఓ స్పాయిలర్ అలర్ట్ అనే చెప్పాలి. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా రూపొందిన ఇన్వెస్టిగేటివ్ ఫ్యామిలీ థ్రిల్లర్‌లో ఇంత పెద్ద ట్విస్ట్‌ను ఎవరూ అసలు ఊహించరు’’ అని తన సోషల్ మీడియాలోపోస్ట్ చేశారు హీరో నితిన్. ప్రస్తుతం అన్నీ తెలుగు వెబ్ సిరీస్‌లన్నింటిలోనూ వ్యూయింగ్ మినిట్స్ పరంగా పులి మేక సిరీస్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.