కె.కోటపాడు,మార్చి18(ఆంధ్రపత్రిక):
“అపుస్మా” రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రామచంద్రారెడ్డి పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంపట్ల “అపుస్మా” ఐటి విభాగం రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటరు డాక్టరు ఖాశీం హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ప్రతినిధి మొట్ట మొదటి సారిగా శాసన మండలిలో విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై వాణి వినిపించే అవకాశం కలగడంఆనందదాయకమని డాక్టరు ఖాశీం అన్నారు. హర్షం వ్యక్తం చేసినవారిలో డాక్టరు ఖాశీం తోపాటు “అపుస్మా” స్టేట్ చీఫ్ మెంటార్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కోశాధికారి ఎం.వి.రావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సీతారామరాజు, కార్యదర్శి ఆదిరెడ్డి రమణ, కోశాధికారి బీశెట్టి ప్రసాదరావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు డాక్టరు శ్రీనివాసరావు, కార్యదర్శి ఎం.వి.వి.సత్యనారాయణ, కోశాధికారి శేషారెడ్డి తదితరులు ఉన్నారు.