Andhrapatrika : మీరు ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంట్లో నుంచే మీరు ఈ పని పూర్తి చేసుకోవచ్చు. అయితే కొన్ని డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలి. అవేంటో తెలుసుకోండి.ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? వాటిని అప్డేట్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు ఈ పనిని ఇంట్లో నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో (Aadhaar Card) అన్ని వివరాలను అప్డేట్ చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పుట్టిన తేదీ, అడ్రస్, పేరు, జెండర్ వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మీరు ఇంటి వద్ద నుంచే వాటిని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆధార్ (Aadhaar) కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే.. దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.ఆధార్ కార్డు కలిగిన వారు ముందుగా మై ఆధార్ అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు లాగిన్ అవుతారు. ఇప్పుడు ఆన్లైన్ అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉటుంది. ఇప్పుడు మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. పేరు, జెండర్, అడ్రస్, పుట్టిన తేదీ అనే ఆప్షన్లు ఉంటాయి.వీటిల్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. సరైన డాక్యుమెంట్ను అప్లోడ్ చేస్తేనే మీ డేట్ ఆఫ్ బర్డ్ అప్డేట్ అవుతుంది. లేదంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది. ఏ ఏ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవచ్చొ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!