Vote From Home : ఓటు వెయ్యాలంటే పోలింగ్ బూత్‌కి వెళ్లాల్సిందేనా? అన్ని విషయాల్లో టెక్నాలజీని వాడేటప్పుడు.. ఓటు విషయంలో ఎందుకు వెనకడుగు వెయ్యడం.. అని ఆలోచించిన ఎన్నికల సంఘం… ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని తెస్తోంది.దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఇదో విప్లవాత్మక స్టెప్ అనుకోవచ్చు. ఇది దేశ ఎన్నికల సరళిని కచ్చితంగా మార్చగలదు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ దాకా రాలేని వారు.. ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించడం బెటర్ అని భావించిన సీఈసీ (Central Election Commission) సరైన నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు… ఇంటి నుంచే ఓటు (Vote From Home) వేసే ఛాన్స్ కల్పిస్తోంది.ఈ సంవత్సరం ఇంకా 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో ముందుంది. మేలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే ముందుగా ఇంటి నుంచే ఓటు విధానాన్ని కర్ణాటకలో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి.. నిన్న కీలక ప్రకటన చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఇంటి నుంచే ఓటు అవకాశం కల్పిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ తెలిపారు.”80 ఏళ్లు దాటిన వారు కూడా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వెయ్యాలని మేం కోరుకుంటాం. వారు రాలేకపోతే, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. ఇంటి నుంచే ఓటు వేసేవారి కోసం మా టీమ్స్… ఫామ్-12డీ పత్రాల్ని వారి ఇళ్లకే తీసుకెళ్తాయి. ఓటు వేయనిస్తాయి. ఇదంతా వీడియో రికార్డ్ చేస్తాయి. ఓటు ఎవరికి వేశారన్నది మాత్రం తెలియదు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలకు చెబుతాం.” అని రాజీవ్ కుమార్ చెప్పారు.దివ్యాంగుల కోసం సాక్షం అనే ఓ మొబైల్ యాప్ (Application) తెచ్చామన్న CEC… అందులో లాగిన్ అయి, ఇంటి నుంచే ఓటు వేయవచ్చని తెలిపారు. అలాగే సువిధ అనే మరో యాప్ తెచ్చామన్న CEC.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను దాని ద్వారా ఇవ్వొచ్చు అన్నారు. అభ్యర్థులు తమ ప్రచారాలు, ర్యాలీలు, సభలకు అనుమతులను ఆ యాప్ ద్వారా తీసుకోవచ్చు అని తెలిపారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో జరగనున్నాయి. మే 24తో ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగుస్తుంది. ఈ కారణంగానే… రాజీవ్ కుమార్ టీమ్ రాష్ట్రంలో తిరుగుతోంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. 17వేల మంది దాకా 100ఏళ్లు దాటిన వారున్నారు. 80 ఏళ్లు దాటినవారు 12.15 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగులు 5.55 లక్షల మంది ఉన్నారు. ఈసారి వీరంతా ఇంటి నుంచే ఓటు వేసే ఛాన్స్ ఉంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!