కె.కోటపాడు,మార్చి26(ఆంధ్రపత్రిక):
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే విధిగా సంపూర్ణ పోషకాహారం అందించాలని స్థానిక ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్ ఎల్.బి.సుశీల అన్నారు. ఐసీడీఎస్ పోషణ్ పక్వడా కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆర్.వై.అగ్రహారం, ఉగ్గినవలస, యడ్లవానిపాలెం గ్రామాల్లో శనివారం ఆమె అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నారు. బాలింతలు సంపూర్ణ పోషకాహారం తీసుకుంటే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్బంగా వీధుల్లో గ్రామపెద్దలు, చిన్నారులు, తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు, ఆయాలు పోషన్ పక్వాడాపై రాలీ నిర్వహించారు. అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులకు అందిస్తున్న మెనూ తోపాటు రికార్డులను తనిఖీచేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.వి.పాలెం పి. హెచ్.సి.హెల్త్ సూపర్వైజర్ జావ్వాది సన్యాసిరావు(చిన్న), ఎం.ఎల్. హెచ్.పి. ఎస్.కిరణ్ జోసెఫ్, ఎ.ఎన్.ఎం. రాము, ఆశా వర్కర్ ఎల్.రమణమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, వై.ముత్యాలమ్మ,వై. రమణమ్మ,, వెంకటలక్ష్మి, రవణమ్మ, పాల్గొన్నారు.