Shikhar Dhawan Breaks Silence on Separation With Wife: ఒక ఇంటర్వ్యూలో.. శిఖర్ ధావన్ తాను మరియు అతని భార్య వేర్వేరు మార్గాల్లో ఎలా వెళ్లాలని నిర్ణయించుకున్నారో చెప్పాడు. రిలేషన్‌షిప్‌లోకి వచ్చే యువతకు ఒక ముఖ్యమైన సలహా ఇస్తూ.. మళ్లీ పెళ్లి గురించి కీలక టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ మరియు అతని భార్య అయేషా ముఖర్జీ విడిపోయారు. ఇది జరిగి కూడా చాలా సమయం గడిచిపోయింది. వీరి విడాకులు గురించి అప్పట్లో చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి శిఖర్ ధావన్ లేదా అయేషా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఈ విషయంపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించాడు.వ్యాఖ్యలు చేశాడుఒక ఇంటర్వ్యూలో.. శిఖర్ ధావన్ తాను మరియు అతని భార్య వేర్వేరు మార్గాల్లో ఎలా వెళ్లాలని నిర్ణయించుకున్నారో చెప్పాడు. రిలేషన్‌షిప్‌లోకి వచ్చే యువతకు ఒక ముఖ్యమైన సలహా ఇస్తూ.. మళ్లీ పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.స్పోర్ట్స్ టాక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… శిఖర్ ధావన్ వివాహంలో తాను ‘విఫలమయ్యాను’ అని అంగీకరించాడు. అయితే అతను తీసుకున్న నిర్ణయాలు తన స్వంతవి కాబట్టి ఇతరుల్ని నిందించనని గబ్బర్ తెలిపాడు. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘‘వివాహం అనే పరీక్షలో నేను విఫలం అయ్యాను. ఎందుకంటే వివాహ బంధం మనుగడ అనేది ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు. వివాహం అంటే.. ఇద్దరు, వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. మా విషయంలో తను తప్పు చేసిందని నేను అనను.. అలాగని నాది తప్పని ఒప్పుకోను. క్రికెట్ భాషలో చెప్పాలంటే.. నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. కనుక ఆ ఆట గురించి నాకు తెలుసు. క్రికెట్ గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా. ఎందుకంటే అది అనుభవంతో వచ్చింది’’ అని చెప్పుకొచ్చాడు.‘‘ఇక మా విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. చాలా చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు కానీ.. తొందర పడను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నాను. ఎవరితోనూ.. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. నాకు నచ్చినట్లు.. బాగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్లో మాత్రం లేను’’ అని చెప్పుకొచ్చాడు.అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ అద్భుతంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ దాటుకుంటూ పోయా. కానీ నా కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఈ సందర్భంగా నేను కుర్రాళ్లకు చెప్పేది ఒక్కటే. రిలేషన్లో ఉంటే, అన్నింటినీ అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండి, తన గురించి మీకు, మీ గురించి తనకు పూర్తిగా తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి’’ అన్నాడు.అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ దాటుకుంటూ పోయా. కానీ నా కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఈ సందర్భంగా నేను కుర్రాళ్లకు చెప్పేది ఒక్కటే. రిలేషన్లో ఉంటే, అన్నింటినీ అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండి, తన గురించి మీకు, మీ గురించి తనకు పూర్తిగా తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి’’ అన్నాడు. అంతేకాక వివాహం అనేది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి 4-5 మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చాడు.