కె.కోటపాడు,మార్చి17(ఆంధ్రపత్రిక):వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా మహిళా విభాగం నూతన అధ్యక్షురాలు, కె.కోటపాడు మండల జడ్పిటిసి సభ్యురాలు, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ఈర్లె అనూరాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు దంపతులను మర్యాదపూర్వకంగా శుక్రవారం అనకాపల్లిలో వారి నివాసంలో కలిశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగాఅనూరాధ నియామకంపై వీరభద్రరావు హర్షం వ్యక్తంచేశారు.ఆమెకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. తండ్రి, రాష్ట్రఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆశయాలను నెరవేర్చడంలో తనయి అనూరాధ ముందున్నారని వీరభద్రరావు అన్నారు. అనుభవజ్ఞులైన మీ లాంటి పెద్దల ఆశీస్సులతో పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పనిచేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనూరాధ అన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!